టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై ప్రివిలేజ్ మోషన్

  • ఈ నోటీసును చదివి వినిపించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
  • ప్రివిలేజ్ కమిటికీ పంపించాల్సిందిగా స్పీకర్ కు వినతి
  • ప్రివిలేజ్ కమిటీకి నోటీస్ ను పంపుతామన్న స్పీకర్
నిన్న ఏపీ అసెంబ్లీలో మద్యం పాలసీపై చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై వైసీపీ సభ్యులు మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడుపై వైసీపీ ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేశపెట్టింది. అచ్చెన్నాయుడు తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే, ఆయనపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తున్నట్లు ఈరోజు శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సభలో చదివి వినిపించారు. ఈ మోషన్ ను ప్రివిలేజ్ కమిటికీ పంపించాల్సిందిగా స్పీకర్ ను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన స్పీకర్.. ప్రివిలేజ్ కమిటీకి నోటీస్ ను పంపుతామని బదులిచ్చారు.
Go Back to Shorts
Assembly
Atchanaidu
srikanth reddy
mla

More Telugu News